Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
వీర మరణం పొందిన సైనికుల రక్త తిలకంతో దిద్దిన నుదిటి బొట్టు
భరత జాతి రక్షణకై జవానులు కట్టిన కరకట్టు వలయం సింధూర్.
ఉగ్రపాక్ ముష్కరులారా నా దేశం మట్టి పై కాలు మోపారో.. ఖబర్దార్ అనే ఇచ్చే రెడ్ సిగ్నల్ సింధూర్.
మా దేశ వీరనారీమణుల ధీర శక్తికి ఎర్రటి తిలక ధారణ
అక్రమంగా మాపై దాడి చేస్తే సక్రమంగా ఇచ్చే సమాధానమే సింధూర్
దొంగచాటున దాడి కాదురా దమ్ముంటే ఎదురుగా వచ్చి కాల్చురా
ఖబర్దార్ అనే ఒక హెచ్చరిక సింధూర్
మా ఆడబిడ్డలు కోల్పోయిన సింధూరాలకు దేశమంతా ఒక్కటై మూకుమ్మడిగా మీపై విరుచుకుపడ్డ పోరాట పటిమ సింధూర్.
భారతదేశ బార్డర్లో అసువులు బాసిన వీర జవానులకు నిజమైన నివాళి..
తూర్పున ఉదయిస్తున్న అరుణ కిరణాల విజయ సంకేతం సింధూర్.
భరతమాత నుదిటి మీద దిద్దిన ఎర్రటి తిలకం
మన దేశం నుండి శత్రువులను పారదోలే సైనిక శక్తి సింధూర్.
సింధూర్ అంటే భారతదేశ ఆడబిడ్డల నుదిటి సింధూరం మాత్రమే కాదు..
అత్యవసర పరిస్థితుల్లో శత్రుమూకలను ఎదుర్కునేందుకు శక్తినిచ్చే భరతదేశ సైన్యపు మహాశక్తి సింధూర్.
పహేల్గాo లో మా దేశ పౌరులను క్రూరంగా బలి గొన్న హేయమైన కవ్విపు చర్యకు సరియైన సమాధానం సింధూర్.
భారత జవాన్ సంఘర్ష కరో.. హమ్ తుమ్హారే సాత్ హై అని సైనికులకు మన అఖండ భారతదేశం ఇచ్చిన
సందేశమే సింధూర్..
💐💐💐💐💐💐
© గుండేటి యోగేశ్వర్
రాష్ట్రపతి అవార్డు గ్రహీత,
పర్యావరణవేత్త, మంచిర్యాల.
సెల్: 98492 54747
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment