(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
అమృత్సోవం
ఉత్సవం ఇది మహోత్సవం
ఆజాది కా అమృత్సోవం
తెల్ల దొరల చీకటి పాలనకు
చరమ గీతం పాడించిన
అమర వీరులకు నివాళోత్సవం
ఉత్సవం ఇది మహోత్సవం
ఆజాది కా అమృత్సోవం
రెండు వందల ఏళ్లు పరపీడపాలనలో
తల్లడిల్లిన తల్లి భారతమ్మ కు
స్వేచ్ఛ ,స్వాతంత్ర్యంమొచ్చి
డెబ్భై ఐదు వసంతాలు అయినందున
తనయులెల్లరు
జరుపుకుంటున్న
ఉత్సవం ఇది మహోత్సవం
ఆజాది కా అమృత్సోవం
నేటి తరానికి నాటి అమరుల త్యాగాలును గుర్తు చెస్తూ
రేపటి పౌరులకు దేశ భక్తి జాతీయితల
స్పూర్తి, ప్రేరణ కలిగిస్తూ జరుపుకుంటున్న
ఉత్సవం ఇది మహోత్సవం
ఆజాది కా అమృత్సోవం
హిందూ, ముస్లిం , క్రైస్తవులు
జైన, బౌద్ధ , సిక్కు మతస్థులు
ప్రాంతమెదైన , పలికేడి భాష ఏదైనా
తన్మయత్వంతో జరుపుకుంటున్న
ఉత్సవం ఇది మహోత్సవం
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
అందరూ ఐకమత్యం తో
జరుపుకుంటున్న ఉత్సవం
ఆజాది కా అమృత్సోవంశ్రీ కే .మధు
హిందీ సహాయక ఆచార్యులు
జే వి ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తుపల్లి
ఖమ్మం జిల్లా, తెలంగాణ98851 66339--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment